జాతకం

మీనం
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి అన్ని రంగాల వారికీ కలిసివచ్చే సమయం. సర్వత్రా అనుకూలతలుంటాయి. అనుకున్నది సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు, అభియోగాలు పట్టించుకోవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. పత్రాల్లో మార్పుచేర్పులు అనివార్యం. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రయాణంలో ఒకింత అవస్థలు తప్పవు.