జాతకం

మీనం
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. ఆప్తులకు సాయం అందిస్తారు. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. అపరిచితులతో మితంగా సంభాషించండి. వాగ్వాదాలకు దిగవద్దు. శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. సంతానం విదేశీ విద్యాయత్నాలు ఫలిస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. ఉపాధి పథకాలు పురోగతిన సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను తట్టుకుంటారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం.