జాతకం

వృషభం
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు అన్ని రంగాల వారికీ శుభదాయకమే. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. కొన్ని పనులు అనుకోకుండా పూర్తవుతాయి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. గృహ వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు పనిభారం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.