జాతకం

వృషభం
కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు వేడుకలను ఘనంగా చేస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడుతాయి. ఆదాయవ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. స్త్రీల కళాత్మతకు ప్రోత్సాహం ఉంటుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. అనుకోని సంఘటనలెదురవుతాయి. పదవులు, బాధ్యతల నుండి తప్పుకుంటారు. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వాగ్ధాటితో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడుతాయి. పందాలా, పోటీల్లో విజయం సాధిస్తారు. వాహన చోదకులకు దూకుడు తగదు. విద్యార్థులకు ఒత్తిడి అధికం.