జాతకం

వృషభం
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి అపోహ కలిగిస్తుంది. విమర్శలు, అభియోగాలు ఎదుర్కుంటారు. మీ చిత్తశుద్ధికి నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పొదుపు పథకాలు లాభిస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. సంతానం ఉన్నత చదువుల గురించి ఆలోచిస్తారు. వ్యాపార విస్తరణకు అనుకూలం. సంస్థల స్థాపనలకు వనరులు సర్దుబాటవుతాయి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అధికారులకు ధనప్రలోభం తగదు. ఆశావాహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి.