జాతకం

వృషభం
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు ఈ మాసం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు అధికం ప్రయోజనకరం. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. సంతానం విజయం సంతృప్తినిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పరిచయాలు బలపడతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. లౌక్యంగా వ్యవహరించాలి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ప్రియుతముల గురించి ఆందోళన చెందుతారు. నిర్మాణాలు వేగవంతమవుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. బెట్టింగ్‌లు వివాదాస్పదమవుతాయి.