జాతకం

వృషభం
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బాధ్యతగా మెలగాలి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించండి. దంపతుల మధ్య తరచు అకారణ కలహం. పంతాలకు పోవద్దు. ఆత్మీయుల రాకపోకలు అధికమవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.