జాతకం

మిథునం
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు వ్యవహారజయం, కార్యసిద్ధి ఉన్నాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వాహనం అమర్చుకోవాలనే కోరిక తీరుతుంది. రశీదులు, కీలక పత్రాలు జాగ్రత్త. దూరపు బంధువుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. శుభకార్యానికి వెళ్లాలనే ఆలోచన బలపడుతుంది. గృహనిర్మాణం పూర్తి కావస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. సోదరుల మధ్య అవగాహన లోపం. మీ అభిప్రాయాలకు అభ్యంతరాలెదురవుతాయి. స్వల్ప అస్వస్థకు గురవుతారు. వైద్యపరీక్షలు అనివార్యం. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది.