జాతకం

మిథునం
మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. సంప్రదింపులు ఫలిస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఖర్చులు విపతీరం. చేతిలో ధనం నిలవదు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగాలి. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పరిచయాలు ఉన్నతికి దోహదపడుతాయి. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. జూదాలు, పందాలకు దూరంగా ఉండాలి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. దైవకార్యంలో పాల్గొంటారు.