జాతకం

మిథునం
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు కష్టం ఫలిస్తుంది. శుభవార్తలు వింటారు. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. దస్త్రం, వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు బలపడుతాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. బాధ్యతలు అధికమవుతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. హామీలివ్వవద్దు. ఆచితూచి వ్యవహరించాలి. గృహం సందడిగా ఉంటుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, అధికారులకు ఒత్తిడి, పనిభారం. విద్యార్థులకు అవగాహన లోపం. వృత్తుల వారికి సామాన్యం. వాహనచోదకులకు దూకుడు తగదు. సమావేశాల్లో పాల్గొంటారు. కళాకారులకు ప్రోత్సాహకరం.