జాతకం

మిథునం
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ఈ మాసం శుభాశుభ మిశ్రమాల సమ్మేళనం. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. యత్నాలు కొనసాగించండి. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆహ్వానాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వేడుకలు, దైవకార్యాల్లో పాల్గొంటారు. బంధుత్వాలు బలపడుతాయి. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. మీ శ్రీమతితో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. నష్టాలు, ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. చిరువ్యాపారులకు ఆశాజనకం.