జాతకం

మిథునం
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ప్రత విషయం స్వయంగా తెలుసుకోవాలి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. దుబారా ఖర్చులు విపతీరం. రాబడిపై దృష్టి పెడతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. ఆత్మీయుల సలహా పాటించండి. ఏకపక్షధోరణి తగదు. సంతానం చదువులపై దృష్టి పెడతారు. విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. వైద్య, న్యా, సాంకేతిక రంగాలవారికి ఆశాజనకరం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. అధికారులకు హోదామార్పు.