జాతకం

మిథునం
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ఈ మాసం ప్రథమార్థం ఏమంత అనుకూలం కాదు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రుణయత్నాలు సాగిస్తారు. అప్రమత్తంగా ఉండాలి. నమ్మకస్తులే మోసగించేందుకు ప్రయత్నిస్తారు. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం విదేశీ చదువులపై దృష్టి పెడతారు. ఆద్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తుల వారాకి ఆదాయాభివృద్ధి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వాహన చోదకులకు అత్యుత్సాహం తగదు.