జాతకం

మిథునం
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు. ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ సలహా ఎదుటివారికి కలిసివస్తుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. మానసికంగా కుదుటపడుతారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఖర్చులు అధికం. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతాయి. ఒక సమాచారం. ఆలోచింపిజేస్తుంది. ఉపాధ్యాయులకు శుభయోగం, ప్రశంసలు, పదోన్నతలు అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం. దీక్షలు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.