జాతకం

మిథునం
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ఈ మాసం ప్రథమార్థం బాగుంటుంది. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ధనలాభం, వాహనసౌఖ్యం పొందుతారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ద్వితీయార్ధం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ప్రకటనలు, సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాతవ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. వృత్తుల వారికి కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు.