
కర్కాటకం
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ మాసం అనుకూలదాయకం. పరిస్థితులు క్రమంగా కుదుటపడతాయి. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కుటుంబసౌఖ్యం పొందుతారు. స్నేహసంబంధాలు బలపడతాయి. అర్థాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. మీ ఇష్టాలను స్పష్టంగా తెలియజేయండి. సంతానం పై చదువులపై దృష్టిపెడతారు. ఫోన్ సందేశాలు, ప్రకటనలు విశ్వసించవచ్చు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. వివాదాలు కొలిక్కివస్తాయి.