జాతకం

కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఈ మాసం యోగదాయకమే. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఉన్నత పదవులు అందుకుంటారు. బాధ్యతలు పెంపొందుతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. పోగొట్టుకున్న పత్రాలు సంపాధిస్తారు. వస్త్రప్రాప్తి, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. కొన్ని సమస్యల నుండి బయటపడుతారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో ఏకాగ్రత వహించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.