జాతకం

కర్కాటకం
కర్కాటకరాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. లక్ష్యం నెరవేరుతుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. ఆహ్వానాలు అందుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. దస్త్రం వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు పదోన్నతి, బాధ్యతల మార్పు. దైవకార్యం, వేడుకల్లో పాల్గొంటారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.