జాతకం

కర్కాటకం
కర్కాటక రాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, అశ్లేష ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. గృహం సందడిగా ఉంటుంది. పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతాయి. వివాహ యత్నాలకు శ్రీకారం చుడుతారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. పనులు సానుకూలవుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఎవినీ అతిగా విశ్వసించవచ్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. పెట్టుబడులకు సమయం కాదు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. సన్మాన సాహిత్య సభల్లో పాల్గొంటారు.