జాతకం

కర్కాటకం
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ప్రతికూలతలు అధికం. ఆచితూచి అడుగేయాలి. శ్రమించినా ఫలితం ఉండదు. మీపై శకునాల ప్రభావం అధికం. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఈ చికాకులు తాత్కాలికమే. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. వేడుకకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. నిరుద్యోగులకు పట్టుదల ప్రధానం. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఉపాధ్యాయులకు పనిభారం, విశ్రాంతి లోపం. వ్యాపారాల అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. తరచూ ఆలయాలు సందర్శిస్తారు. 26, 12, 16, 19, 20, 22, 27, 29 తేదీలు కలిసిరాగలవు. 1, 3, 9, 10, 11, 13, 15, 23, 25, 28 తేదీలు నిరాశాజనకం.