జాతకం

కర్కాటకం
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష వ్యవహార జయం, ధనలాభం ఉన్నాయి. మీ ఆధిపత్యం కొనసాగుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఇతరుల కోసం వ్యయం చేస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పెట్టుబడులకు తరుణం కాదు. బంధుత్వాలు బలపడతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే అవకాశాలున్నాయి. జాతక పొంతన ప్రధానం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపుచేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.