
సింహం
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గ్రహబలం స్వల్ప అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేయాలి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందికి గురిచేస్తాయి. పెద్దల సలహా పాటించండి. ఒంటెద్దు పోకడ తగదు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. కొత్త పనులు చేపడతారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. సన్నిహితులతో తరచు సంభాషిస్తారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.