జాతకం

సింహం
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఈ మాసం యోగదాయకం. రావలసిన ధనం అందుతుంది. కొన్ని సమస్యల నుండి బయటపడుతారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. ఖర్చులు సామాన్యం. ఆత్మీయుల ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. సన్నిహితుల ప్రోత్సాహనం ఉంటుంది. సంప్రదింపులతో హడావుడిగా ఉంటారు. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. అనుభనజ్ఞుల సలహా పాటించండి. స్థిరాస్తి క్రయవిక్రయంలో పునరాలోచన అవసరం. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. సంతానం చదువుల పట్ల మరింత శ్రద్ధ వహించాలి. పెట్టుబడులకు అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అధికారులకు సాదర వీడ్కోలు పలుకుతారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.