జాతకం

సింహం
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ప్రేమానుబంధాలు బలపడుతాయి. వ్యవహారానుకూలత ఉంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. వాయిదా పడిన పనులు పూర్తికాగలవు. ఖర్చులు విపరీతం. దైవకార్యం, అవసరాలకు బాగా వ్యయం చేస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వాహనం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి వహించండి. ఆహ్వానం అందుకుంటారు. నగలు, నగదు జాగ్రత్త. ఊహించని సంఘటనలెదురవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి, ధనలాభం. సహోద్యోగులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వస్త్ర, పచారీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. జూదాలు, పందేల జోలికి పోవద్దు.