జాతకం

సింహం
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం కొత్త పనులకు శ్రీకారం చుడతారు. పరిచయాలు బలపడుతాయి. సంప్రదింపులకు అనుకూలం. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతోషకరమైన వార్తలు వింటారు. మీ కృషి ఫలిస్తుంది. ధనలాభం, వస్త్రపాప్తి ఉన్నాయి. శుభకార్యంలో పాల్గొంటారు. ఆత్మీయుల ఆదరణ ఆకట్టుకుంటుంది. ఖర్చులు విపరీతం. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. సంస్థల స్థాపనకు వనరులు సర్దుబాటవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు విశ్రాంతి లోపం. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం.