జాతకం

సింహం
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఈ మాసం శుభదాయకమే. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. గృహం సందడిగా ఉంటుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ అతిధ్యం అపోహ కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. విలువైన వస్తువు, నగదు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పనులు సానుకూలమవుతాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగస్తుల సమర్థత అధికారులకు లాభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సరుకు నిల్వలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు. దైవకార్యంలో పాల్గొంటారు.