జాతకం

సింహం
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఈ మాసం శుభదాయకమే. సంప్రదింపులకు అనుకూలం. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ధనలాభం ఉంది. ఖర్చులు విపరీతం. ప్రయోజనకరం. ఆపదలో వున్న వారికి సాయం అందిస్తారు. పరిచయాలు బలపడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు సానుకూలమవుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. భాగస్వామిక చర్చలు నిరుత్సాహపరుస్తాయి. తీర్థయాత్రు, విదేశీ ప్రయాణానికి సన్నాహాలు సాగిస్తారు.