జాతకం

సింహం
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఆర్థికస్థితి నిరాశాజనకం. పురోగతి లేక నిరుత్సాహానికి గురవుతారు. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య తరచూ కలహాలు. సామరస్యంగా మెలగండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. అవివాహితులకు శుభయోగం. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. ఆహ్వానం అందుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. 2. 12, 14, 19, 20, 24, 27, 29 తేదీలలో అభివృద్ధి 3, 4, 7, 10, 11, 15, 17, 23, 26, 28 తేదీలలో అప్రమత్తంగా ఉండాలి.