జాతకం

సింహం
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఈ మాసం అనుకూలతలు అంతంత మాత్రమే. కార్యసాధనకు మనోబలం ముఖ్యం. ఆశావహదృక్పధంతో వ్యవహరించండి. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. సంతానం చదువులపై దృష్టి సారించండి. విలువైన వస్తువులు జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు అదనపు బాధ్యతలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వేడుకకు హాజరవుతారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.