జాతకం

సింహం
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. ఆచితూచి వ్యవహరించాలి. కార్యసాధనకు సంకల్పసిద్ధి ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. సోదరీ సోదరులతో విభేదిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ధనసహాయం అర్ధించటానికి మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పనుల్లో అవాంతరాలు, చికాకులు అధికం. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.