జాతకం

కన్య
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అధికం. ధనానికి లోటుండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. సన్నిహితులతో తరచుగా సంభాషిస్తుంటారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. ఔషధసేవనం, ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.