జాతకం

కన్య
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు ఖర్చులకు అంతుండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. చెల్లింపుల్లో జాగ్రత్త. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తంది. పదవులు, పురస్కారాలు అందుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వేడుకలకు హాజరవుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. పెట్టుబడులకు తగిన సమయం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. విద్యార్థులు పోటీల్లో రాణిస్తారు. ప్రయాణం చికాకుపరుస్తుంది.