జాతకం

కన్య
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. ఆలోచనులు నిలకడగా ఉండవు. వ్యవహారాల్లో ప్రతికూలతలు, చికాకులు అధికం. అవకాశాలు దక్కకపోవచ్చు. నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. స్థిమితంగా ఉండడానికి యత్నించండి. ఆగ్రహావేశాలు ప్రదర్శించవద్దు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యాలకు హాజరవుతారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. గృహమార్పు నిదానంగా ఫలితమిస్తుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు. జూదాలు, పందాలకు దూరంగా ఉండాలి.