జాతకం

కన్య
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. విలాసాలు, దైవ కార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. గృహంలో స్తబ్థత తొలుగుతుంది. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. వ్యాపారాలూ ఊపందుకుంటాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. దైవదర్శనంలో అవస్థలు తప్పవు.