జాతకం

కన్య
కన్యారాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. ఈ మాసం యోగదాయకమే. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పరిస్థితులు అనుకూలత ఉంది. వ్యతిరేకుల సన్నిహితులవుతారు. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ధనలాభం ఉంది. ఖర్చులు సంతృప్తికరం. చెల్లింపుల్లో జాగ్రత్త. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. గృహమార్పు కలిసివస్తుంది. ఆరోగ్య పట్ల శ్రద్ధ అవసరం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. బంధుత్వాలు బలపడతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆధ్యాత్మిక సంస్థలకు సాయం అందిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. అధికారులకు హోదామార్పు స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వృత్తుల వారికి సామాన్యం. ముఖ్యమైన పత్రాలు అందుతాయి.