జాతకం

కన్య
కన్యారాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. పట్టుదలతో వ్యవహరించండి. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. వాగ్వాదాలకు దిగొద్దు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టుగా వదిలేయండి. ఆదాయానికి తగ్గట్టు కలిసివస్తుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆత్మీయులరాక ఉపశమనం కలిగిస్తుంది. సంతానానికి నిదానంగా ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ప్రకటనలు విశ్వసించవద్దు. వ్యాపారాలు, సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు.