జాతకం

కన్య
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు వ్యవహారజయం, ధనలాభం ఉన్నాయి. సమర్థతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు, వ్యాపకాలు అధికమవుతాయి. గృహంలో కొత్త వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. కొత్త వ్యక్తులను నమ్మవద్దు. కుటుంబీకుల గురించి ఆందోళన చెందుతారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆహ్వానం అందుకుంటారు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. క్రీడాపోటీలు ఉల్లాసం కలిగిస్తాయి. బెట్టింగులకు పాల్పడవద్దు.