జాతకం

కన్య
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ఆదాయం బాగుంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయటా అనుకూలతలు నెలకొంటాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. డబ్బుకు లోటుండదు. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంది. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పత్రాల్లో సవరణలు అనివార్యం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనివార్యం.