జాతకం

కన్య
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు అభీష్టం నెరవేరుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. పనులు, కార్యక్రమాలు విజయవంతమవుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఆత్మీయుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అయిన వారితో విభేదిస్తారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. మీ బలహీనతలు అందుపులో ఉంచుకోండి.