జాతకం

తుల
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. పొదుపు మూలక ధనం అందుతుంది. వస్త్రాలు, విలువైన వస్తువులు కొనుగోలుచేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. అసాధ్యమనుకన్న పనులు తేలికగా పూర్తవుతాయి. వివాదులు సద్దుమణుగుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్యం తగదు. చిన్ననాటి ఉపాధ్యాయులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. క్రీడాపోటీల్లో పాల్కొంటారు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. వాహన చోదకులకు దూకుడు తగదు.