జాతకం

తుల
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు ఆర్థికస్థితి సామాన్యం. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఆశావహ దృక్పథంతో వ్యవహరించండి. ఆరోగ్యం జాగ్రత్త. సన్నిహితుల రాక ఉత్సాహాన్నిస్తుంది. ఖర్చులు అధికం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. పట్టుదలకు పోవద్దు. చాకచక్యంగా వ్యవహరించాలి. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. భాగస్వామిక చర్చలు వాయిదా పడుతాయి.