జాతకం

తుల
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. బంధుత్వాలు బలపడుతాయి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యవహారానుకూలతకు మరింత శ్రమించాలి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. సంతానం విజయం సంతృప్తినిస్తుంది. ఆర్థిక సమస్యలు కొలిక్కివస్తాయి. కొన్ని ఇబ్బందులు తప్పవు. సంప్రదింపులకు అనుకూలం. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. గృహమార్పు అనివార్యం. కొత్త పరిచయాలేర్పడుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, విశ్రాంతి లోపం. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. ఉపాధ్యాయుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.