జాతకం

తుల
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు ఈ మాసం శుభాశుభాల మిత్రమం. వ్యవహారానుకూలత అంతగా ఉండదు. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ అవసరం. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆహ్వానం అందుకుంటారు. ఆత్మీయులు హితవు పాటించండి. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. గృహంలో స్తబ్థత నెలకొంటుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు విశ్రాంతి లోపం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. వాహనం ఇతరులకివ్వడం క్షేమం కాదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు.