జాతకం

తుల
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. వేదుకలకు సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు ధనం అందుతుంది. పెట్టుబడులకు తరుణం కాదు. మాటతీరుతో ఆకట్టుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. గృహంలో ప్రశాంత నెలకొంటుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం ఆలస్యంగా లభిస్తుంది. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. నిర్మాణాలు వేగవంతమవుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. రవాణా రంగాలవారికి పురోభివృద్ధి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.