జాతకం

తుల
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు ఈ మాసం యోగదాయకమే. ఆర్థికంగా బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. పరిచయాలు బలపడతాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. గుట్టుగా మెలగండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య దాపరికం తగదు. పత్రాలు అందుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. చిన్న వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధ్యాయుల కష్టం ఫలిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.