జాతకం

వృశ్చికం
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట వ్యవహార ఒప్పందాల్లో మెళకువ వహించండి. తొందరపడి ఒప్పందాలు కుదుర్చుకోవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. మీ శ్రీమతికి అని విషయాలు తెలియజేయండి. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. సామరస్యంగా వ్యవహరించాలి. ప్రియతములను కలుసుకుంటారు. వృత్తి, ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలు, చికాకులు అధికం. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. దైవదర్శనంలో అవస్థలు తప్పవు.