జాతకం

వృశ్చికం
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఆహ్వానాలు అందుకుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆర్థికస్థితి సామాన్యం. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. రుణదాతల ఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. ఆప్తుల సాయంతో ఒక సమస్యను అధిగమిస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. బంధుత్వాలు బలపడుతాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. మీ అభిప్రాయాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణం అనివార్యం. దైవకార్యంలో పాల్గొంటారు.