జాతకం

వృశ్చికం
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట శుభకార్యంలో పాల్గొంటారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. గత సంఘటనలు పునరావృతమవుతాయి. చెల్లింపులు, నగలు స్వీకరణలో జాగ్రత్త. ఆరోగ్యం జాగ్రత్త. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనకు స్పందన లభిస్తుంది. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. జూదాలు, పందాలకు దూరంగా ఉండాలి.