జాతకం

వృశ్చికం
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రుణ ఒత్తిళ్లు, సకాలంలో ధనం అందక ఇబ్బందులెదుర్కుంటారు. గృహ నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. దంపతుల మద్య అవగాహన నెలకొంటుంది. సంతానం విద్యా విషయాలపై శ్రద్ధ అవసరం. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగాలి. ఊహించని ఖర్చులెదురవ్వటంతో మీ చేతిలో ధనం నిలువదు. ఓర్పుతో వ్యవహరించాలి. ఏ విషయంలోను తొందరపడవద్దు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. నిరుద్యోగులకు ఉన్నత అవకాశం లభిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో పోటీని దీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగుస్తాయి. ఆత్మీయులను దైవకార్యాలు, విందులకు ఆహ్వానిస్తారు. సంకల్పసిద్ధి, ప్రశాంతతకు అమ్మవారిని మందారాలు, కనకాంబరాలతో పూజించండి.