జాతకం

వృశ్చికం
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల ప్రోత్సాహం ఉంటుంది. మీ నిజాయితీ ప్రశంసనీయమవుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువులతో సంబంధాలు బలపడతాయి. శుభకార్యం నిశ్చయమవుతుంది. పెట్టిపోతల్లో మెళకువ వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. పనులు వేగవంతమవుతాయి. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. నూతన పెట్టుబడులు కలిసివస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 25, 6, 12, 14, 16, 19, 20, 22, 24, 27, 29 తేదీలు ఆశాజనకం. 4, 7, 9, 10, 11, 13, 15, 17, 23, 25, 26 తేదీలలో అప్రమత్తంగా ఉండాలి.